- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పబ్బుల్లో డ్రగ్స్ పేరుతో కస్టమర్ ఆకర్షిస్తున్న నిర్వాహకులు
కొండాపూర్ క్వాక్ ఎరినా పబ్బు పై గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీమ్, నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

దిశ, శేరిలింగంపల్లి : కొండాపూర్ క్వాక్ ఎరినా పబ్బు పై గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీమ్, నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.. గత రాత్రి డీజే బ్లాక్ కాఫీ పేరిట నిర్వాహకులు భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కస్టమర్లు హాజరయ్యారు. రక్ష వినియోగం అధికంగా ఉందనే సమాచారంతో దాడులు నిర్వహించగా...దాదాపు 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. పబ్బుల్లో పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వినియోగిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన ఈగిల్ ఫోర్స్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్ర టాస్క్ ఫోర్స్‌కు చెందిన ఈగిల్ ఫోర్స్, సైబరాబాద్ నార్కోటిక్స్, గచ్చిబౌలి పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక దాడి చేశారు.
పబ్బుకి వచ్చిన వారి వివరాలు ముందుగానే సేకరించారు. మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారనే అనుమానంతో 64 మందిని గుర్తించారు. కార్యక్రమానికి అంతరాయం కలగాకుండా తనిఖీ నిర్వహించారు. ABONN మూత్ర మాదక ద్రవ్య పరీక్ష కిట్లను ఉపయోగించి పరీక్షించగా.. నలుగురిలో గంజాయి, బెంజోడియాజెపైన్ ఉన్నట్లు తేలింది. మరో నలుగురిలో గంజాయి మెథాంఫేటమిన్ ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం ఎనిమిది మంది మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు నిర్ధారించారు. ఆ వ్యక్తులు స్వచ్ఛందంగా తాము మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు అంగీకరించారు. అరెస్టు అయిన వారిలో మోనిష్ ఉమేష్, వ్యాపారి, ప్రుద్వీరాజ్, నిర్మాణ కాంట్రాక్టర్ ,అభిషేక్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రిషబ్, వ్యాపారం హరిత్, సాఫ్ట్‌వేర్ ,రిత్విక్, ఉబెర్ అనలిస్ట్ ఉన్నారు.






