హై టెన్షన్ పోల్ ఎక్కి దూకుతానంటూ వ్యక్తి హల్‌చల్‌

by Bhanu |   (  Updated:2025-07-11 07:17:47  IST  )

హై టెన్షన్ పోల్ ఎక్కి దూకుతానంటూ వ్యక్తి హల్‌చల్‌
X

దిశ, శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఓ వ్యక్తి హై టెన్షన్ విద్యుత్ స్తంభంపై ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ హల్‌చల్‌కు కారణమయ్యాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

గుర్తుతెలియని వ్యక్తి హైటెన్షన్ పోల్‌ పైకి ఎక్కి, పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అతడిని కిందకు దింపే ప్రయత్నాలు ప్రారంభించారు. హై టెన్షన్ పోల్ ఎక్కిన వ్యక్తి ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. అతని ఇల్లు, వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Next Story