- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గోపన్ పల్లిలోని లేబర్ క్యాంపులో నివసిస్తున్న మధుసూదన్ హవల్దార్ (23) అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు . అతన్ని విచారించగా.. గోపనపల్లిలోని లేబర్ క్యాంపులో నివసిస్తున్న మధుసూదన్ హవల్దార్ గా గుర్తించారు.అతని గది ని సోదా చేసి 1.523 కిలోల గంజాయితో పాటు, ఒక తూకం యంత్రం, ప్యాకేజింగ్ సామాగ్రి ,ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పశ్చిమ బెంగాల్ నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్టు నిర్ధారించిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన సరఫరా దారుగా ఉన్న మాణిక్ దాస్ ఠాకూర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.






