- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, శేరిలింగంపల్లి: అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ఓవర్ స్పీడ్ గా బైక్ నడుపుతూ మెట్రో పిల్లర్ ను ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి 10 గంటల 50 నిమిషాల సమయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్ పై కేపీహెచ్ బీ వైపు నుండి మియాపూర్ వైపు వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ తనకు తానుగానే మియాపూర్ మెట్రో పిల్లర్ నెంబర్ 631కు ఢీ కొట్టాడు. దీంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అటువైపుగా వస్తున్న వాహనదారులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. స్పాట్ లోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రోడ్లన్నీ ఖాళీగా ఉండడంతో ఓవర్ స్పీడ్ గా వచ్చి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు.






