- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడాకా చూపిస్తామన్న మల్లన్న... కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) (చింతపండు నవీన్) తన కార్యాలయంపై జరిగిన దాడి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై బీసీల తడాఖా చూపిస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు, జాగృతి కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) (చింతపండు నవీన్) తన కార్యాలయంపై జరిగిన దాడి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై బీసీల తడాఖా చూపిస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు, జాగృతి కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కవిత నివాసం, ఆఫీసు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేయగా, ఆయన గన్‌మెన్ గాలిలో ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఈ దాడిని తనను చంపే కుట్రగా మల్లన్న ఆరోపిస్తూ... ఇకపై తఢాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కవిత నివాసం వద్ద ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛిత సంఘటనలను జరగకుండా ప్రత్యేక బృందాలను మోహరించారు.






