మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఫుల్ ఖుష్..

by Taduka Kalyani |

మీరు హెల్మెట్ పెట్టుకొండి..మీ ప్రాణాలను కాపాడుకోండి..ఈ నినాదంతో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ డీసీపీ రాహూల్ రెడ్డి మార్చి నెలలో దేశంలోనే మొదటి సారిగా హెల్మెట్ బ్యాంక్ ను ప్రారంభించారు.

మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఫుల్ ఖుష్..
X

దిశ, సిటీక్రైం : మీరు హెల్మెట్ పెట్టుకొండి..మీ ప్రాణాలను కాపాడుకోండి..ఈ నినాదంతో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ డీసీపీ రాహూల్ రెడ్డి మార్చి నెలలో దేశంలోనే మొదటి సారిగా హెల్మెట్ బ్యాంక్ ను ప్రారంభించారు. మీరు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించండి.. అంటూ పిలుపునిచ్చారు. దీని కోసం మేము మీకు 24 గంటల పాటు హెల్మెట్ ను ఉచితంగా అద్దెకు ఇస్తాం. మీరు హెల్మెట్ కొనుకుని తిరిగి మాకు అద్దెకు ఇచ్చిన హెల్మెట్ ను తిరిగి ఇవ్వండంటూ వాహనదారుల్లో అవగాహన కల్పించారు.

13 వేల మంది వాహనదారులు మారిపోయారు--

సికింద్రాబాద్, బేగంపేట్, అల్వాల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఈ హెల్మెట్ బ్యాంక్ లను ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో హెల్మెట్ లు ధరించకుండా వాహనదారులు కనిపించినప్పుడు ట్రాఫిక్ పోలీసులు వారికి మీ డబ్బు మాకు వద్దు-మీరు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణీంచడమే మా లక్ష్యమని వివరించి, హెల్మెట్ లను ధరించి వాహనాలను నడపడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ట్రాఫిక్ పోలీసులు వివరించారు. ఈ అవగాహనతో మేల్కొన్న దాదాపు 13 వేల మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లను కొనుగోలు చేసుకున్నారని పోలీసు రికార్డుల ద్వారా స్పష్టమైంది. ఈ 13 వేల మంది వాహనదారులు నాలుగు హెల్మెట్ బ్యాంక్ లలో వారి పూర్తి వివరాలు అంటే పేరు, ఫోన్ నెంబరు, వాహనం నెంబరు వంటివి హెల్మెట్ బ్యాంక్ లో నమోదు చేసుకుని ఉచితంగా అద్దెకు హెల్మెట్ లను తీసుకున్నారు. 24 గంటల తర్వాత తిరిగి వచ్చి అద్దెకు తీసుకున్న హెల్మెట్ లను తిరిగిచ్చేసి తాము కొనుగొలు చేసిన హెల్మెట్ లను పోలీసులకు చూపించారు. ఈ పరిణామంతో ట్రాఫిక్ పోలీసులు చాలా సంతోషానికి గురైయ్యారు. వాహనదారులు ఇలా మారి హెల్మెట్ లను ధరిస్తుండడం తో వారిలో వచ్చిన క్రమశిక్షణకు పోలీసులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

నేను 500 హెల్మెట్ లను ఇస్తా--

బేగంపేట ప్రాంతంలో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సంఘటనలో ద్విచక్రవాహనదారులు దాదాపు ఆరు అడుగులు ఎత్తుకు ఎగిరి కింద పడ్డాడు. తలకు హెల్మెట్ ఉండడంతో అతను సురక్షితంగా తలకు గాయం కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఆ వాహనదారుడు హెల్మెట్ బ్యాంక్ వద్దకు వచ్చి మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కల్పించిన అవగాహనతో తాను హెల్మెట్ ధరించడం ప్రారంభించాను. ఈ యాక్సిడెంట్ లో తనను హెల్మెట్ కాపాడడంతో తాను ట్రాఫిక్ పోలీసుల హెల్మెట్ బ్యాంక్ కు 500 హెల్మెట్ లను ఇస్తానని చెప్పడంతో పోలీసులు ఆనందానికి గురైయ్యారు.

కొత్తగా 13 వేల మంది హెల్మెట్ లు ధరిస్తుండడం ఫుల్ హ్యాపీ-రాహూల్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్..

హెల్మెట్ బ్యాంక్ తో ద్వారా కల్పించిన అవగాహనతో 13 వేల మంది కొత్తగా హెల్మెట్ లను ధరించి రోడ్ల పై వస్తుండడం ఆనందంగా ఉంది. వాహనదారులు ఇలా ట్రాఫిక్ క్రమశిక్షణను పాటిస్తుండడం అభినందనీయం. హెల్మెట్ బ్యాంక్ ద్వారా అవగాహన కలిగి ఆ తర్వాత వారు ఎదుర్కొనే స్వయం అనుభవంతో చాలా మంది హెల్మెట్ లు ఇప్పిస్తామని ముందుకు వస్తున్నారు. ఒవ వైపు రోడ్ల పై సురక్షితమైన ప్రయాణం కోసం వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే మరో వైపు హెల్మెట్ లు లేకుండా ప్రయాణిస్తు పలు మార్లు ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన మారకుండా ఇంకా ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం.అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ ల నుంచి వాహనదారులను కాపాడుతున్నామనే ఈ అంశం మాకు సంతృప్తిని ఇస్తుంది.

Next Story