ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కార‌ణంగా మాల‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య

by Ratna Kumari |   (  Updated:2026-05-06 15:59:21  IST  )

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మాలలు అన్ని రంగాలలో వెనుకబడ్డారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కార‌ణంగా మాల‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు :  మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
X

దిశ, హిమాయత్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మాలలు అన్ని రంగాలలో వెనుకబడ్డారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. రోస్టర్ పాయింట్స్ , కుల గణన సర్వేలో మాలలు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. లక్డీకాపూల్ లోని సామ్రాట్ కాంప్లెక్స్ లో మాల సంక్షేమ సంఘం, మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2011 జనాభా ప్రకారం.. ఎస్సీ వర్గీకరణ చేశారని దీనివల్ల మాలలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. షమీమ్ అక్తర్ కమిషన్ మాలలు జనాభా తక్కువ చూపించి, మాదిగల జనాభా ఎక్కువ చూపెట్టారని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసిన రోస్టర్ పాయింట్ ల వల్ల మాలలకు విద్య , ఉద్యోగ రంగాలలో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే రోస్టర్ పాయింట్ లను సవరించి , మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయపోరాటంతో పాటు ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెన్నయ్య హెచ్చరించారు. ఈ మేరకు హైకోర్టులో మాల మహానాడు, ఎస్టీ ఐక్య వేదిక, మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసులు వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, అంసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డాక్టర్ మంచాల లింగస్వామి, మాల విద్యావంతుల వేదిక నాయకులు డాక్టర్ నిమ్మ బాబూరావు, జేఎన్టీయూ హెచ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ మంద రంజిత్ కుమార్, మాల మహానాడు అధ్యక్షులు గోపోజు రమేష్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ జాతీయ ఉపాధ్యక్షులు దాసరి విశాల్, ఆలిండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక అధ్యక్షులు ఎస్. నాను, జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు అంజలీ కుమారి, సంఘాల నాయకులు బైండ్ల శ్రీనివాస్, ఉత్తమ్ శ్రీనివాస్, మార్పెల్లి శ్రీకాంత్, రాకేష్, అనిల్, జెట్టి గిరి పాల్గొన్నారు.

Next Story