చింతల్ బస్తీలో భారీ అగ్నిప్రమాదం

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

చింతల్ బస్తీలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాసబ్ ట్యాంక్ పరిధిలోని చింతల్ బస్తీలో వీర్ నగర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి, క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని సమాచారం. మంటల్లో సర్వం కాలిపోయాయని, తన పిల్లల స్టడీ సర్టిఫికెట్లతో సహా అన్నీ కాలిపోయాయని, కట్టుబట్టలతో మిగిలామని ఇంటి యజమాని నారాయణ కన్నీటి పర్యంతం అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story