- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం.. 50 గుడిసెలు దగ్దం
హైదరాబాద్ లోని చందా నగర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని చందా నగర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మాణ సంస్థ పలు భారీ భవన సముదాయాలు నిర్మిస్తోంది. అయితే అందులో పనిచేసే కార్మికులంతా అక్కడే గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. సోమవారం కార్మికులంతా భావన నిర్మాణ పనుల్లో మునిగి ఉండగా.. ఒక్కసారిగా అక్కడి గుడిసెలకు నిప్పు అంటుకొని తగలబడిపోయాయి. దాదాపు 50 గుడిసెలు ఉన్నట్టుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ మహానగరంలో ఎండా, వాన, చలి నుంచి రక్షించుకునేందుకు తమకు ఉన్న చిన్న ఆ గూడు మంటల్లో కాలిపోవడంతో కార్మికులు భోరున కన్నీళ్లు పెట్టుకున్నారు.






