- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనిచేస్తున్న ఇంట్లోనే నగలు చోరీ
పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ పనిమనిషి అరెస్ట్ చేశారు మియాపూర్ పోలీసులు.

దిశ, శేరిలింగంపల్లి: పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ పనిమనిషి అరెస్ట్ చేశారు మియాపూర్ పోలీసులు. ఈఘటనకు సంబంధించి మియాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మైత్రి నగర్ ఫేస్ 2, శ్రీశ్రీ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కృష్ణ కార్తీక్ ఇంట్లో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం చాంద్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన భాగమ్మ అలియాస్ లక్ష్మీ (4౦), అల్వీన్ కాలనీలో నివాసం ఉంటూ కృష్ణ కార్తీక్ ఇంట్లో గత 10 సంవత్సరాలుగా పనిమనిషిగా చేస్తుంది. ఎంతో నమ్మకంగా ఉండే లక్ష్మీ ఈనెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వార్డురోబ్ లో ఉన్న బీరువా తాళాలు తీసుకుని బీరువాలోని 90 గ్రాముల బంగారు ఆభరణాలు, 77 గ్రాముల వెండి ఆభరణాలు దొంగిలించింది.
వాటిని లక్ష్మీ నారాయణ ఖేడ్ లోని ఓ బంగారం దుకాణంలో అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఇంటి యజమాని కృష్ణ కార్తీక్ నుండి ఫిర్యాదు స్వీకరించిన మియాపూర్ పోలీసులు, బంగారం అమ్ముతున్న లక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి బంగారు నగలను స్వాధీనం చేసుకుని దొంగతనానికి పాల్పడిన లక్ష్మీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే తన ఇంట్లోని నగలు దొంగతనానికి గురైనట్లు పోలీసులు చెప్పే వరకు ఇంటి యజమాని కృష్ణ కార్తీక్ లు తెలియక పోవడం గమనార్హం. గత 10 ఏళ్లుగా పనిచేస్తుందిగా అనే నమ్మకంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆసరాగా చేసుకుని నిందితురాలు దొంగతనానికి పాల్పడిందని, పని మనుషుల తీరుపట్ల యజమానులు జాగ్రత్తగా వ్యవహరించాలని మియాపూర్ సీఐ క్రాంతి కుమార్, డీఐ రమేష్ నాయుడు సూచించారు.






