కేటీఆర్ ను కలిసిన మాగంటి సునీత గోపినాథ్

by velandi.Saikiran |

జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా మరోసారి ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు

కేటీఆర్ ను కలిసిన మాగంటి సునీత గోపినాథ్
X

దిశ, జూబ్లీహిల్స్: జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా మరోసారి ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బుధవారం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపినాథ్.... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి , నియోజక వర్గం పరిస్థితిని గురించి వివరించారు.. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల పనితీరు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి చర్చించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి పార్టీ జెండా ఎగురవేయాలని, పార్టీ శ్రేణులంతా ఒక్కతాటి మీద పనిచేయాలని కేటీఆర్ సూచించారు.

Next Story