బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

by velandi.Saikiran |

హయత్ నగర్ గ్రామ చరిత్ర, గొప్పతనం ప్రతిబింబించేలా బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు

బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
X

దిశ, వనస్థలిపురం: హయత్ నగర్ గ్రామ చరిత్ర, గొప్పతనం ప్రతిబింబించేలా బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ ​కాంగ్రెస్ ​పార్టీ ఇన్​చార్జి మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. అక్టోబర్ 9 నుంచి 12 వరకు హయత్ నగర్ గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహిస్తుండడంతో ​ బుధవారం హయత్ నగర్ లోని అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఎల్బీనగర్​ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి , మధుయాష్కీ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్​ మాట్లాడుతూ... గ్రామస్తులందరూ కులాలకు, రాజకీయాలకతీతంగా ఐక్యమత్యంతో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.

తాను పుట్టి పెరిగిన గ్రామమైన హయత్ నగర్ లో బొడ్రాయి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని, తన వంతుగా రూ. 2 లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. బొడ్రాయి పండుగ అనగానే తన చిన్నప్పుడు స్మృతులు గుర్తుకు వస్తున్నాయని... హయత్ నగర్ లో హనుమాన్, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించే వారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కళ్లెం నవజీవన రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్​గౌడ్, మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత గుర్రం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ హయత్ నగర్ అధ్యక్షులు చెన్నగోని రవీందర్ గౌడ్, ఎల్బీనగర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ బోడ భిక్షపతి, గ్రామ పెద్దలు నక్క దర్శన్ గౌడ్, కళ్లెం శంకర్ రెడ్డి, దిండు ప్రవీణ్ గౌడ్, టైగర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story