- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్త్రీలు ఎందుకు క్రూరంగా తయారవుతున్నారన్న యాంకర్ కు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన మాధవీలత
బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత గురించి అందరికీ తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత గురించి అందరికీ తెలిసిందే. అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఫైర్ బ్రాండ్ మాధవీలత.. భారీగా అనుచరగణాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇటీవల ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల వెలుగులోకి వస్తున్న భర్తల హత్యల కేసుల గురించి మహిళలు ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడగగా.. మహిళలు భద్రకాళులు, వారు ఎవరికీ భయపడరని, దైర్యంగా ఉంటారని చెప్పింది. మహిళలు ఎలా ఉండాలో చెప్పమని అడిగిన ప్రశ్నకు.. మగాడు ఎలా ఉండాలని ఎందుకు అడగటం లేదని, మహిళలను మాత్రమే అలా ఉండాలి , ఇలా ఉండాలని ఎందుకు రూల్స్ పెడతారని ఫైర్ అయింది.
మగవాళ్ళు ఎలా ఉండాలో చెప్పమని ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారో చెప్పమని యాంకర్ ను నిలదీశారు. లోకంలో ఇన్నికోట్ల జనాభాలో ఒకలో ఇద్దరో ఉన్నంత మాత్రాన ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఆడవాళ్ళు ఎక్కువ హింస పడుతున్నారా? మగవాళ్ళు ఎక్కువ హింస పడుతున్నారో చెప్పాలని, ఎక్కడ మగవాళ్ళు ఎక్కువ సంఖ్యలో బాధ పడుతున్నారో తనకి లెక్కలు చూపాలని నిలదీశారు. ఎప్పుడూ మతం గురించి, సనాతనం గురించి మాట్లాడే మాధవీలత, ఈసారి ఆడవాళ్ళ గురించి స్టాండ్ తీసుకోవడంతో అదరగొట్టారు మేడమ్ అంటూ నెటిజన్స్ ఆమెను ప్రశంసిస్తున్నారు. వీడియో






