వెనక నుంచి ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. యువకుడి ప్రాణాలు బలి

by Bhanu |

వాటర్ ట్యాంకర్ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని 100 ఫీట్ రోడ్డులో చోటుచేసుకుంది.

వెనక నుంచి ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. యువకుడి ప్రాణాలు బలి
X

దిశ, శేరిలింగంపల్లి : వాటర్ ట్యాంకర్ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని 100 ఫీట్ రోడ్డులో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా పరకాల ప్రాంతానికి చెందిన దీపక్ (28) నగరానికి వలసవచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్న సమయంలో వెనక నుండి వచ్చిన వాటర్ ట్యాంకర్ (టీఎస్ 12యూఏ 9090) దీపక్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో దీపక్ తల, కాళ్లు చిద్రం అయి అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story