- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల మీదికి దూసుకు వెళ్లిన లారీ.. కానిస్టేబుల్ మృతి
by Muthe.Rajitha |
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న పోలీసులపైకి అతివేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి దూసుకెళ్లడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Next Story






