‘హలో బీసీ చలో ఢిల్లీ’ కార్యక్రమాన్నివిజ‌య‌వంతం చేద్దాం

by Ratna Kumari |

ఈ నెల 30, 31 తేదీలలో ఢిల్లీలో నిర్వహించనున్న “హలో బీసీ ఛ‌లో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బానాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

‘హలో బీసీ చలో ఢిల్లీ’ కార్యక్రమాన్నివిజ‌య‌వంతం చేద్దాం
X

దిశ, వనస్థలిపురం : ఈ నెల 30, 31 తేదీలలో ఢిల్లీలో నిర్వహించనున్న “హలో బీసీ ఛ‌లో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బానాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వనస్థలిపురం బీసీ కార్యాలయంలో బుధవారం వాల్ పోస్ట‌ర్ విడుదల చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సహకారంతో డాక్టర్ అరుణ్ కుమార్ నేతృత్వంలో, బి. అరవిందస్వామి అధ్యక్షతన ఢిల్లీలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బీసీ కులాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సెమినార్, ధర్నాకు వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు.

ఈ సందర్భంగా బానాల అజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు అన్ని ప్రభుత్వ రంగాలలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు బీసీలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించకపోవడం బీసీలను మోసం చేయడమేనని ఆరోపించారు. దీనికి నిరసనగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వెలుగుమ‌ట్ల భూధాన్ భూమి బాధితులకు న్యాయం చేయాలని, రెండు నెలల పసికందు మృతి చెందిన కుమ్మేర ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాము, గండు శివుడు పాల్గొన్నారు.

Next Story