- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Forest Martyrs' Remembrance Day:‘వారి సేవలను స్మరించుకుందాం’.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

దిశ , హైదరాబాద్ బ్యూరో: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. నెహ్రూ జువాలాజికల్ పార్క్ లో గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన "అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా” జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం ఈ రోజున "అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నారు. 1730 వ సంవత్సరములో రాజస్థాన్ రాష్ట్రంలో బిష్నోయి తెగకు చెందిన 360 మంది కేజ్రి చెట్లును రక్షించేందుకు తమ ప్రాణ త్యాగం చేశారని మంత్రి తెలిపారు.
అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధినిర్వహణలో వన సంపద సంరక్షణ కొరకు జీవితములను త్యాగం చేసిన అటవీ సిబ్బంది సేవలను స్మరించుకుంటున్నామన్నారు . తెలంగాణ రాష్ట్రంలో 1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు 22 మంది అటవీ సిబ్బంది ధైర్య సాహసాలతో అంకిత భావంతో పనిచేసే అటవీ నేరాలకు పాల్పడిన నేరస్తులను పట్టుకోవడంలో తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. అటవీ రక్షణ లో భాగంగా 2014 నుంచి 2025 జూలై మాసం వరకు టేకు అలాగే మారు జాతి కలపకు సంబంధించిన కేసులు, 10375 అటవీ భూ ఆక్రమణ కేసులను కూడా నమోదు చేయడం జరిగిందని అన్నారు. 2025 సంవత్సరంలో రూ. 149.66 కోట్ల కలపకు గాను 96,813 కేసులు నమోదు చేసి రూ 51.50 కోట్ల జరిమానా వసూలు చేయడం జరిగిందని, 18002 వాహనాలను కూడా స్వాధీన పరచు కోవడం జరిగిందని అన్నారు.
నేరస్తులు తెలియని కేసులు 29,858 నమోదు చేసి రూ. లు 67.13 కోట్ల విలువ కలిగిన టేకు , మారు జాతి కలపను స్వాధీనపరచుకొని జప్తు చేయడం జరిగిందని , 174 బేస్ క్యాంపులు, 62 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు . అడవుల సంరక్షణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 2,118 వాహనాలు అటవీ అధికారులకు అందించామని వెల్లడించారు. 2022 సంవత్సరంలో 1516 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని, ఇందులో 1393 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 15 మంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 18 మంది ఏసిఎఫ్ ఇతర పోస్టులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలోఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం అటవీ అమరవీరుల స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్ అహ్మద్, పిసిసిఎఫ్ హెడ్ సువర్ణ, పిసిసిఎఫ్ వైల్డ్ లైఫ్ ఏలు సింగ్ మేరు, సి సి ఎఫ్ ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, వివిధ విభాగాల అధికారులు ఘనంగా నివాళులర్పించారు.






