- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ORR పై విరిగి పడిన కొండచరియలు... తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
by Muthe.Rajitha |
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్‌లోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిరేవుల నుంచి నార్సింగి-TGPA వెళ్లే రహదారిపై పెద్ద బండరాయి జారి రోడ్డుపై పడింది. దీంతో ఆ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ ఘటనలో వాహనదారులు అప్రమత్తతో ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ రూట్లో భారీ ట్రాఫిక్ కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
- Tags
- Landslides
- ORR
Next Story






