కార్పొరేట్ స్కూల్ లో విద్యార్థులకు రక్షణ కరువు

by Nallavelli.Anjaneyulu |

పేరుకేమో కార్పొరేట్ స్కూల్ నిర్వహణలో నిల్ భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల రక్షణను గాలికి వదిలేశారు.

కార్పొరేట్ స్కూల్ లో విద్యార్థులకు రక్షణ కరువు
X

దిశ, చైతన్యపురి : పేరుకేమో కార్పొరేట్ స్కూల్ నిర్వహణలో నిల్ భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల రక్షణను గాలికి వదిలేశారు. తరగతి గది పై కప్పు పెచ్చులూడి పడడంతో ఆరో తరగతి విద్యార్థికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కార్పొరేటర్, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. గడ్డి అన్నారం డివిజన్ లోని కొత్తపేటలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ లో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిపై తరగతి గదిలో పెచ్చులూడి కాలుకు గాయమైంది. కానీ నిర్వాహకులు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం సోమవారం మరొక విద్యార్థిపై పెచ్చులూడిపడ్డాయి. విద్యార్థులు వెళ్లడానికి బాత్రూంలో కూడా శుభ్రంగా ఉండవని తెలుసుకున్న విద్యార్థి సంఘాలు శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులతో లక్షల రూపాయలను ఫీజు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించే విధంగా ఎందుకు మరమ్మత్తులు చేయించడం లేదు. విషయం తెలుసుకున్న గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి స్కూల్ వద్దకు చేరుకొని పరిస్థితిని డీఈవో కు వివరించగా.. వెంటనే స్కూల్ వద్దకు వెళ్లి పరిస్థితి పరిశీలించాలని ఎంఈవోను ఆదేశించారు. గడ్డి అన్నారం డివిజన్ పరిధిలో ఇలాంటి స్కూలు ఎన్ని ఉన్నాయో తాను పరిశీలించి అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకునే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళనలో కాంగ్రెస్ నాయకుడు దాము మహేందర్ యాదవ్, బీజేపీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story