- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలరించిన కూచిపూడి మరింగంటి శౌర్య సంపద అరంగేట్రం
ప్రఖ్యాత నాట్య గురువు, కళాశ్రీ డా. పి. రమాదేవి శిష్యురాలు మరింగంటి శౌర్య సంపద కూచిపూడి అరంగేట్రం అలరించింది.

X
దిశ, రవీంద్రభారతి : ప్రఖ్యాత నాట్య గురువు, కళాశ్రీ డా. పి. రమాదేవి శిష్యురాలు మరింగంటి శౌర్య సంపద కూచిపూడి అరంగేట్రం అలరించింది. మంగళవారం రాత్రి రవీంద్రభారతిలోని ప్రధాన మందిరంలో మరింగంటి శౌర్య సంపద ప్రదర్శించిన కూచిపూడి నాట్యం వీక్షకులను ఆకట్టుకుంది. కూచిపూడి అరంగేట్రాన్ని అద్భుత హావభావాలను ప్రదర్శించి మంగళంతో ముగించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి మాట్లాడుతూ..గురువు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శౌర్య సంపద నాట్య రంగంలో రాణించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నాట్య గురువు డా. ఎస్.పి.భారతి, ప్రముఖ కవి డా. ఆచార్య ఫణీంద్ర, ప్రతిభ పురస్కార్ అవార్డు గ్రహీత ఎస్. కుమార్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళా కృష్ణ లు తదితరులు పాల్గొన్నారు.
Next Story






