KTR : అందుకు గర్వంగా ఉంది : కేటీఆర్

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) వాసులను ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మరో కీలక ఫ్లైఓవర్ రేపు అందుబాటులోకి రానుంది.

KTR : అందుకు గర్వంగా ఉంది : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) వాసులను ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మరో కీలక ఫ్లైఓవర్ రేపు అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి-కొండాపూర్(Gachibowli-Kondapur FlyOver) మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ శనివారం నుంచి వాహనదారులకు అందుబాటులోకి రానున్న క్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాగ్రామ్(SRDP) లో భాగంగా మరో కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు.

తాము అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ కష్టాల నుంచి బయట పడేయటానికి 42 ఫ్లైఓవర్స్ నిర్మించతలపెట్టి, పదేళ్ళలో అందులో 36 ఫ్లైఓవర్స్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. మరో 6 ప్రాజెక్టులు 2024 కల్లా పూర్తి కావాల్సింది అన్నారు. హైదరాబాద్ పౌరుల తరపున కేసీఆర్ కు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన ప్రాజెక్టులో వారి పాలనాకాలం పూర్తయ్యేలోపు అయినా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు కేటీఆర్ తన X ఖాతాలో ట్వీట్ చేశారు.

కాగా గచ్చిబౌలి-కొండాపూర్ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ను రేపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ కు దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్ధన్ రెడ్డి పేరు మీదుగా PJR ఫ్లైఓవర్(PJR FlyOver) గా నామకరణం చేయనున్నారు.

Next Story