- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యూచర్ సిటీల పేరిట భూదందా: కేటీఆర్
గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని నిరుద్యోగ యువతీ యువకులకు తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు.

దిశ, చైతన్యపురి: గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని నిరుద్యోగ యువతీ యువకులకు తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. ఈదేశ భవిష్యత్తుకు యువత దిక్సూచి మోసం చేసిన వారికీ తగిన బుద్దిచెప్పాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. శనివారం సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన యువ సంగ్రామ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఇదే సరూర్ నగర్ వేదికగా 2022 లో దగా జరిగిందని యూత్ డిక్లరేషన్ పేరిట వేలాది మందిని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు. 10 లక్షల వరకు రుణాలు వడ్డీలేకుండా ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు 24 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. బడే భాయ్ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడని చోటే బాయ్ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని వివరించారు. మోసం చేసిన వారికి బుద్ధి చెప్పడానికి ఈ సమావేశమని యువతను కాంగ్రెస్ తెలివిగా మోసం చేసిందన్నారు. చైతన్యవంతమైన యువత వాళ్ళ మోసపు మాటల వలలో పడ్డారన్నారు. ప్రియాంక, రాహుల్ డెత్ డెక్లరేషన్ రాయాలని సూచించారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేవని ఓన్లీ లూటిఫికేషన్లు మాత్రమేనన్నారు.
అడుగుతుంటే విషం తాగి చావమంటూ...
కొలువుల కుంభమేళా కాదని కొలువులంటే యువతను పోలీసులు కొడుతున్నారని జాబులు నింపకుండా రాహుల్ జేబులు నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్ చూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని తెలిపారు. కేవలం భూములు, బూడిద, ఇసుక నోటిఫికేషన్ జరుగుతోందని విమర్శించారు. ఢిల్లీ నుండి టూరిస్టు రాహుల్ వచ్చి ఓకే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. తెలివిలేని రాహుల్‌కు మన బాద తెలియదు మన బాష తెలియదన్నారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ బుట్టదాఖలయిందన్నారు. రక్తపిశాచి కాంగ్రెస్ రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ లు ఏమైనాయని తలా తోక లేకుండా రాష్ట్ర మంత్రులు పొంతననేని మాటలతో ఉద్యోగాలు ఇచ్చామని మాట్లాడుతున్నారని అసెంబ్లీ సాక్షిగా తాను అడిగితే 16 వేలు మాత్రమే ఇచ్చినట్లు చెప్పారని మరి ఎవరి మాటలు నమ్మాలో చెప్పాలన్నారు. 20 వేల పోలీస్ ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు అడుగుతుంటే విషం తాగి చావమంటూ ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. గ్రూప్ 1, 2 ఉద్యోగాలు ఇవ్వమంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ హిట్లర్ కంటే దారుణంగా మాట్లాడుతున్నాడని నీకు త్వరలో క్లయిమాక్స్ ఉంటదన్నారు. మా హయాంలో కేసీఆర్ మోడీని ఒప్పించి 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చూశారని, పేపర్ లీకేజి దొంగలను మేమే పట్టుకున్నామని వివరించారు.
పొరపాట్లను సరిచేసుకుంటామని...
మీ ఆవేదన అర్ధం చేయనుకుని మీకు న్యాయం చేసేవరకు తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. జీవో నంబర్ 46 ను రద్దు చేయాలన్నారు. రాజీవ్ యువవికాసంతో యువతను మోసం చేసారు కానీ రేవంత్ రెడ్డి బ్రదర్స్‌కి మాత్రం వికాసం కలిగిందన్నారు. ప్రైవేట్ రంగంలో 26 లక్షల కొలువులు ఇచ్చామని తెలిపారు. తాము తెచ్చిన అమెజాన్, అమరరాజా కంపెనీలకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేశారని తెలిపారు. ఫ్యూచర్ సిటీల పేరిట భూదందా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చందాలు, దంధాలు నడుస్తున్నాయని హైదరాబాదులో ఉన్న కంపెనీలు గుజరాత్‌కు తరలిపోతుంటే బీజేపీ వారు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. రేవంత్‌కు బండి సంజయ్‌కు పోటీ పరీక్షలు రాసే తెలివి ఉందా అని ప్రశ్నించారు. 2028 లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది ఒక అన్నగా మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను నేను తీసుకొని అండగా ఉంటా.. మీరు కోరుకున్న విధంగా మీ వెంట నేను ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.






