- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. సిట్ విచారణకు కొండా విశ్వేశ్వరరెడ్డి, వేమూరి రాధాకృష్ణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కొండా విశ్వేశ్వరరెడ్డి, వేమూరి రాధాకృష్ణ హాజరయ్యారు..

దిశ, వెబ్ డెస్క్/ జూబ్లీహిల్స్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 257 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది సిట్. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది నాయకుల ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసింది. 4200లకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. రాజకీయనాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ తేల్చింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించాయని అధికారులు అనుమానించారు. ఈ మేరకు ఆయనను విచారణకు పిలిచారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న విచారణకు ఆయన హాజరయ్యారు. 2 గంటల పాటు ఆయనను సీట్ అధికారులు విచారించారు.
బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి విచారణకు హాజరు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది.. దీనిపై స్పష్టతకోసం ఆయనను కూడా శుక్రవారం విచారణకు హాజరయ్యారు. టెలిఫోనిక్ సంభాషణలు రాజకీయ లబ్దికి వాడినట్లుగా ఆరోపణలు వస్తుండటంతో, ఈ కేసులో ప్రతిపక్ష నేతలతోపాటు మీడియా ప్రతినిధుల పేర్లు కూడా విచారణకు నెట్టెస్తున్నాయి.
మరిన్ని రాజకీయ పేర్లు వెలుగులోకి రావచ్చా?
ఇటీవల మంత్రి వివేక్ కూడా తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణలు చేశారు. దీనితో ఈ వ్యవహారంలో రాజకీయ ప్రేరణలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సీట్ దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ ప్రముఖులు, పాత్రికేయుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి.






