మహాకాళి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు

by Muthe.Rajitha |

బీజేపీ(BJP) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నేడు అంబర్ పేటలోని మహాకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు.

మహాకాళి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ(BJP) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నేడు అంబర్ పేటలోని మహాకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు. నగర వ్యాప్తంగా బోనాల(Bonalu) ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంబర్ పేటలోని మహాకాళి ఆలయంలో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. కాగా కిషన్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ విజయలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్. హనుమంతరావు సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని, ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ నిర్వాహకులు కిషన్ రెడ్డిని, విజయలక్ష్మిని, హనుమంతరావును సన్మానించారు.

Next Story