- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ లో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...
జూబ్లీహిల్స్, వెంగల్ రావు నగర్ డివిజన్, లోని వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, బస్తీ వాసులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు.

దిశ, జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్, వెంగల్ రావు నగర్ డివిజన్, లోని వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, బస్తీ వాసులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం..శ్రీనగర్ కాలనీ డివిజన్, నాగార్జున నగర్ లో బస్తీ వాసులతో మాట్లాడారు. వివిధ విభాగలకు సంబంధించిన అధికారులతో కలిసి సమావేశం నిర్వహించిన కేంద్రమంత్రి కాలనీల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక బస్తీ ప్రజలు తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే సమస్యలను పరిష్కరించాలని తన వెంట ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..నేడు ప్రజలతో బస్తీ వాసులతో మాట్లాడుతున్నప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా కాలనీల్లో వీధిలైట్ల సమస్య తీవ్రంగా ఉంది, తాగునీటి సమస్య కూడా ఉందని స్థానిక బస్తివాసులు చెప్తా ఉన్నారు. అయితే వీటిని పూర్తి చేయమని అధికారులను ఆదేశించాను. కానీ నిధుల కొరత ఉందని అధికారులు స్వయంగా చెప్తున్నారు. గ్రామాల్లో సైతం వీధి లైట్లు పోయిన వెను వెంటనే వీధిలైట్లు వేసే సాంప్రదాయం ఉండేది, అలాంటిది విశ్వ నగరంగా చెప్పుకునే హైదరాబాద్ నగరంలో వీధిలైట్లు సమయానికి వేయడం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని చెప్పొచ్చు అని ఎద్దేవ చేశారు.పేరుకే కమాండ్ కంట్రోల్ ఉంది కానీ సీసీ కెమెరాలు లేకపోవడంతో కాలనీల్లో జరుగుతున్నా అసాంఘిక కార్యక్రమాల్ని కనిపెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సీసీ కెమెరాలు ఉంటే అన్ని కాలనీలతో కనెక్టివిటీ చేసి ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటదని పేర్కొన్నారు.
70% రెవెన్యూ హైదరాబాద్ నగరం నుంచి వస్తున్న నగరాన్ని పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని కనీసం వీధిలైట్లు వేయించలేని దుర్భరమైన ఆర్థిక స్థితిలో ఉంది . వీధి లైట్లకు టెండర్లు వేసాం కానీ సప్లై జరగడం లేదని ఈరోజు కాలనీలో ప్రజలు అధికారులకు చెప్తున్నారు వెంటనే నగరంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న నగరంలోని అన్ని బస్తీల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కనీసం కాలనీల్లో వీధిలైట్లు వెలగకపోతే మౌలిక వసతుల ఏర్పాటు జరగక పోతే నగర అభివృద్ధి కుంటుపడుతుంది నగరానికి పెట్టుబడులు రావు అన్నారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు బస్తీలో కాలనీలు అంబర్‌పేట్, గౌలిగూడ లాంటి ప్రాంతాలు హైదరాబాద్ అని ప్రభుత్వం గుర్తించాలి ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, హైటెక్స్ చూపించి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని చెప్తే నగరం అభివృద్ధి చెందదు, బస్తీలని పాత బస్తీలను అభివృద్ధి చేయండి మౌలిక వస్తువులు ఏర్పాటు చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కిలారి మనోహర్, విజయ్ కుమార్ , ప్రేమ్ కుమార్ , సతీష్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ జకియ సుల్తానా , తదితర బిజెపి నాయకులు, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.






