- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : ఫ్యాన్సీ నెంబర్లకు (Fancy numbers) ఉన్న క్రేజ్ తో కాసుల పంటను పండిస్తోంది ఆర్టీఏ. వాహనాలకు కేటాయించే నెంబర్లలో ఫ్యాన్సీ నెంబర్లకు వేలంపాట పాడుతూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. వేలంపాట నిర్వహించిన ప్రతిసారి లాభాన్ని పొందుతోంది. అందుకే ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఈ విధానాన్ని కూడా ఆర్టీఏ (RTA) అనుసరిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఓ (Khairtabad RTO) పరిధిలో ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల కోసం ఆన్లైన్ వేలంపాటను (Online Auction) నిర్వహించారు. పలు సంస్థలు, పలువురు వ్యాపారులు, ఔత్సాహికులు తమకు నచ్చిన నెంబర్లను దక్కించుకోవడానికి వేలంపాటలో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఈ ఆన్లైన్ వేలంపాటలో ఆర్టీఏ దాదాపు రూ.65.38 లక్షల రూపాయలను ఆదాయంగా పొందింది.
ఆర్టీఏ నిర్వహించిన ఆన్లైన్ వేలంపాటలో TG09H9999 నెంబర్ అత్యధికంగా రూ.22.72 లక్షల వరకు పలకగా, TG09J0003 నంబర్ రూ.1.15 లక్షల వరకు ధర పలికింది. TG09J0009 నంబర్ కోసం జరిగిన పోటీలో డండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.6,80,000 చెల్లించి నెంబర్‌ను సొంతం చేసుకుంది. TG09J0006 కోసం సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ రూ.5.70లక్షల వరకు చెల్లించింది. TG09J0099 నెంబర్‌ను గోదావరి ఫార్చ్యూన్ సంస్థ రూ.3.40లక్షలకు, TG09J0001 నంబర్‌ను శ్రీనిధి ఐటీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.60లక్షలు చెల్లించి పొందాయ.
నిహారిక ఎంటర్టైన్‌మెంట్ TG09J0005 నంబర్‌ను రూ.2.40లక్షలు చెల్లించి పొందగా, TG09J0018 నంబర్‌ను రోహిత్ రెడ్డి ముత్తు రూ.1.71లక్షలకు కొనుగోలు చేశారు. TG09J0007 నంబర్‌ను కొండవరపు శ్రీనివాస్ నాయుడు రూ.1.69లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. TG09J0077 నంబర్‌ను మీనాక్షి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1.41లక్షలను చెల్లించి విజయవంతంగా బిడ్ గెలిచింది. ఇక TG09J0123 నెంబర్‌ను రూ.1.19లక్షలు చెల్లించి అకుల మాధురి దక్కించుకున్నారు. ఫ్యాన్సీ వాహన నంబర్ల కోసం నిర్వహించే ఆన్లైన్ వేలం ప్రతిసారి ఆకర్షణీయ బిడ్లతో లాభదాయకంగా కొనసాగుతూనే ఉందని ఖైరతాబాద్ ఆర్టీవో అధికారులు తెలిపారు.






