- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రేన్ వద్దకు బడా గణేష్.. కిక్కిరిసిన శోభాయాత్ర
హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఖైరతాబాద్ బడా వినాయకుని నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఖైరతాబాద్ బడా వినాయకుని నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. రాజ్ దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం మీదుగా క్రేన్ నంబర్ 4 కు చేరుకుంటోంది. అశేష భక్తజనం మధ్య మరికాసేపట్లో మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. బడా గణపతి మహా శోభయాత్ర సందర్భంగా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల జనం కిక్కిరిసి పోయారు. మరోవైపు హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన 30 క్రేన్ల వద్ద వినాయకుల నిమజ్జనం అవిరామంగా జరుగుతోంది. దాదాపు ముప్పై వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు కొనసాగుతోంది.
Next Story






