40 గంటలపాటు గణేష్ నిమజ్జనాలు.. రేపు ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం

by Naga Rani Yarlagadda |

తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణేషుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నిమజ్జనాలు (Hyderabad Ganesh Immersion 2025) కొనసాగుతుండగా..

40 గంటలపాటు గణేష్ నిమజ్జనాలు.. రేపు ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణేషుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నిమజ్జనాలు (Hyderabad Ganesh Immersion 2025) కొనసాగుతుండగా.. రేపు నగరంలో మిగిలిన అన్ని గణేష్ మండప నిర్వాహకులు గణనాథుల్ని నిమజ్జనం చేయనున్నారు. ఈ క్రమంలో నగర ట్రాఫిక్ పోలీసులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క ట్యాంక్ బండ్ (Tank Bund) వద్దే 50 వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని పోలీసులు అంచనా వేశారు. 40 గంటలపాటు నిమజ్జనం కొనసాగనుందని సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. నగరంలో 29 వేల మంది పోలీసులతో బందోబస్త్ నిర్వహిస్తున్నామన్నారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనాలకు చాలెంజింగ్ గా తీసుకున్నామని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డెవిస్ తెలిపారు. నగరంలో 3200 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని, సుమారు 10 లక్షల మంది గణేష్ నిమజ్జనాలను వీక్షించేందుకు వస్తారని అంచనా వేశామన్నారు. కాగా.. రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర (Khairatabad Ganesh Shobha Yatra) ప్రారంభమవుతుందని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. భారీగా గణేష్ నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సొంత వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వాడుకోవాలని, కార్ పూలింగ్ విధానంతోనూ ట్రాఫిక్ తగ్గుతుందని సూచించారు. అలాగే నిర్దేశిత ప్లేసుల్లోనే వాహనాలను పార్క్ చేయాలని పేర్కొన్నారు.

Next Story