- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సగం ధరకు బంగారం అంటూ… రూ.65 లక్షల మోసం..!
కేజీ బంగారంను తక్కువ ధరకు ఇస్తానని బురిడీ కొట్టించిన కర్నాటకకు చెందిన ముఠాలోని ఓ సభ్యుడిని సోమవారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, సిటీక్రైం : కేజీ బంగారంను తక్కువ ధరకు ఇస్తానని బురిడీ కొట్టించిన కర్నాటకకు చెందిన ముఠాలోని ఓ సభ్యుడిని సోమవారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి 40 లక్షల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాల స్వామి, అదనపు డీసీపీ నర్సయ్య, సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్యతో కలిసి వెల్లడించిన వివరాల ప్రకారం...చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన మునుకుంట్ల నిరజంన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మార్చి నెలలో అతనికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రెడ్డిగా పరిచయం చేసుకున్నాడు.
ఫోన్ కాల్స్ తో స్నేహం పెంచుకున్న గుర్తు తెలియని వ్యక్తి రెడ్డి నిరంజన్ కు బంగారంను సగం ధరకే ఇస్తానని చెప్పి నమ్మించాడు. ముందుగా ఐదు గ్రాముల బంగారాన్ని సగం ధరకే ఇచ్చాడు. ఆ తర్వాత పెద్ద అంబర్ పేట్ ప్రాంతంలో రెడ్డి ఇంకా అతని స్నేహితులు పలు మార్లు కలిసారు. మే నెలలో ఫోన్ చేసిన రెడ్డి కేజీ బంగారాన్ని సగం ధరకే ఇస్తానని చెప్పి నిరంజన్ ను నమ్మించాడు. 65 లక్షల రూపాయాలను తీసుకువస్తే కేజీ బంగారాన్ని ఇస్తానని చెప్పి నిరంజన్ ను దిల్ సుఖ్ నగర్ ప్రాంతానికి రమ్మన్నాడు.
దీంతో నిరంజన్, తన స్నేహితుడితో కలిసి రూ.65 లక్షలు తీసుకుని వచ్చాడు. అక్కడికి వచ్చి నరంజన్ రెడ్డికి ఫోన్ చేయడంతో పుత్లీబౌలి ప్రాంతానికి రమ్మనడంతో నిరంజన్ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రెడ్డి, మరో ఇద్దరితో కలిసి నెంబర్లు లేని ద్విచక్రవాహనాల మీద వచ్చి ఆటో స్టాండ్ వద్ద నిరంజన్ నుంచి 65 లక్షల నగదుతో కూడిన బ్యాగును తీసుకుని అతనికి బంగారం ఉందంటూ ఓ బ్యాగును ఇచ్చి రెడ్డి వెళ్ళిపోయాడు. బ్యాగును తీసుకున్న నిరంజన్ బంగారం ఉందా అని తనిఖీ చేయగా చీరలలో రాళ్లు పెట్టి ఇచ్చినట్లు గుర్తించాడు. మోసపోయానంటూ నిరంజన్ అఫ్జల్ గంప్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ణాణంతో ఈ మోసానికి పాల్పడ్డ ముగ్గురిలో జయకుమార్ ను గుర్తించి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. విచారణలో కర్నాటక మాన్వి ప్రాంతానికి చెందిన జయకుమార్, ఉదయ్ అలియాస్ రెడ్డి, సందీప్ అలియాస్ రఘులతో కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. జయకుమార్ నుంచి 40 లక్షల నగదు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.






