- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేష్ మండపాల వద్ద "లడ్డు" చోరీల పై నజర్ పెట్టండి:CP సీవీ ఆనంద్
గణేష్ నవరాత్రుల నేపథ్యంలో సమస్యలు సృష్టించే వ్యక్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు.

దిశ, సిటీ క్రైమ్: గణేష్ నవరాత్రుల నేపథ్యంలో సమస్యలు సృష్టించే వ్యక్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఈస్ట్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలో సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అంబర్ పేట్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. గణేష్ మండపాల వద్ద లడ్డు చోరీలు జరగకుండా పోలీసులు, మండపం నిర్వాహకులు నజర్ పెట్టాలన్నారు. అదే విధంగా ఉత్సవాలు, ఊరేగింపులకు ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించే వారి పై నిఘా పెట్టాలన్నారు. రౌడీ షీటర్ ల కదలికల పై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ నుంచి నిమజ్జనానికి వచ్చే విగ్రహాలకు పటిష్ట బందోబస్తును కల్పించాలన్నారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని సీపీ పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.






