ఎయిమ్స్ త‌ర‌హాలో టిమ్స్ ఉండాల‌న్న‌దే కేసీఆర్ ఆలోచ‌న

by Ratna Kumari |   (  Updated:2026-05-15 09:52:11  IST  )

ఎయిమ్స్ త‌ర‌హాలో టిమ్స్ ఉండాల‌న్న‌దే మాజీ సీఎం కేసీఆర్ ఆలోచ‌న అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

ఎయిమ్స్ త‌ర‌హాలో టిమ్స్ ఉండాల‌న్న‌దే కేసీఆర్ ఆలోచ‌న
X

దిశ, జూబ్లీహిల్స్ : ఎయిమ్స్ త‌ర‌హాలో టిమ్స్ ఉండాల‌న్న‌దే మాజీ సీఎం కేసీఆర్ ఆలోచ‌న అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్ర‌వారం ఆయ‌న ఎర్ర‌గ‌డ్డ‌లోని టిమ్స్ ఆసుప‌త్రిని ప‌రిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో వైద్యం అంటే గాంధీ , ఉస్మానియా , నిమ్స్ ఆసుపత్రి లే గుర్తుకు వ‌స్తాయి అని తెలిపారు. కానీ ప్ర‌తీ పేద‌వాడికి ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో చికిత్స అందించాలనే ఆలోచన పుట్టి.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాజీ సీఎం కేసీఆర్ ఈ టిమ్స్ ఆసుప‌త్రుల నిర్మాణాల‌కు 2022లో శంకుస్థాప‌న చేశామ‌న్నారు.

ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేశారని తెలిపారు. చెస్ట్ ఆసుపత్రి ప్రాంతంలో టిమ్స్‌ను నిర్మించామన్నారు. సుమారు 1,200 కోట్ల రూపాయలతో కార్పోరేట్ ఆసుపత్రులను తలదన్నే విధంగా టిమ్స్‌ను కేసీఆర్ నిర్మించారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో నాలుగు టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో అతి పెద్ద ఆసుపత్రి ఎంజీఎం అని కేటీఆర్ అన్నారు. రెండు వేల పడకల సామర్థ్యంతో నిమ్స్‌ను కూడా విస్తరించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ విజన్ చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. ఆయన ప్రభుత్వం కొనసాగి ఉంటే గత సంవత్సరమే టిమ్స్ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి వచ్చేదని వ్యాఖ్యానించారు. పరిశోధనల కోసం అకాడమిక్ బ్లాక్, రీసెర్చ్ బ్లాక్, ఆడిటోరియం బ్లాక్‌లను కూడా నిర్మించామని తెలిపారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని.. బేషజాలకు పోకుండా ఆసుపత్రులను త్వరలోనే ప్రారంభించాలని కోరుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రావుల శ్రీధరెడ్డి , మాగంటి సునీత గోపినాథ్ , పి.విష్ణు వర్ధన్ రెడ్డి, దేదీప్య రావు, విజయ్ ముదిరాజ్ , రాజ్ కుమార్ పటేల్ , పలువరు బీఆర్‌ఎస్ నేతలు టిమ్స్‌ను పరిశీలించారు.

కేసీఆర్ ఉంటే రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది: ‘టిమ్స్’ ప్రారంభంపై కేటీఆర్ ఫైర్

Next Story