తెలంగాణలో అవినీతి పెరగడానికి కేసీఆరే బాధ్యుడు

by Elthuri vijay kumar |

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపు 400 అవినీతి కేసులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ నమోదుచేసిందని ఓబీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ తెలిపారు.

తెలంగాణలో అవినీతి పెరగడానికి కేసీఆరే బాధ్యుడు
X

తెలంగాణలో అవినీతి పెరగడానికి కేసీఆరే బాధ్యుడు

-ఓబీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ

దిశ, హిమాయత్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపు 400 అవినీతి కేసులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ నమోదుచేసిందని ఓబీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ తెలిపారు. అంతకుముందు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కేవలం 800 కేసులు మాత్రమే అనగా సగటున ఏడాదికి 80 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బుధవారం మీడియా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎనిమిది వందల కేసుల్లో అవినీతిపరుల నుండి తగిన మొత్తం తీసుకొని, ఈ కేసులన్నీ నీరుకారుస్తూ ప్రాసిక్యూషన్కు పంపించకుండా కేవలం శాఖా పరమైన విచారణ మాత్రమే కేసీఆర్ అనుమతించారని చెప్పారు. తెలంగాణలో అవినీతి ఊడలు మరింత ఎక్కువగా కావడానికి కేసీఆర్ కారణం అయినాడని ఆళ్ల ఆరోపించారు. కేసీఆర్ వంటి అవినీతి చరిత్ర కలిగిన నాయకుడి నుంచి తెలంగాణ ప్రజలు మంచిని ఆశించడం అత్యాశే అవుతుందని అన్నారు.

కేసీఆర్ మరొక దురభిప్రాయం ఉండేది. అదేమిటంటే తెలంగాణలో అవినీతి కేసులు నమోదు చేస్తే తెలంగాణ సమాజంలో తన ప్రభుత్వం మీద దురభిప్రాయం వస్తదనే ఉద్దేశంతో అవినీతి నిరోధక శాఖను కూడా నిర్వీర్యం చేశాడంటంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. అవినీతిలో పట్టుపడ్డ వాళ్ళను శిక్షించడం కానీ, వారి మీద తగిన చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ విఫలం చెందారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వ శాఖల్లో దారుణమైన అవినీతి జరగడానికి పూర్తి బాధ్యత వహించాలని, అటువంటి దుర్మార్గమైన పరిపాలన తెలంగాణ ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వకూడదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈనాడు ఒక చిన్న స్థాయి విద్యుత్ అధికారి అంబేద్కర్ దాదాపు 200 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో దొరికిపోవడం అంటే ప్రజా ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ప్రభుత్వ నిఘాసంస్థలు సిగ్గుపడాలి. నూతన ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి చాలా కేసులు నమోదు కావడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ మూడు నెలల కాలంలో దాదాపు 1000 కోట్ల రూపాయల అవినీతి కేసుల్ని ప్రభుత్వం గుర్తించింది. ఇంకా అవినీతినిరోధక శాఖలో కేవలం 50శాతం మంది సిబ్బందితో మాత్రమే నడిపిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖను మరింత బలపరచాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులుపెట్టి వీరందరిని శిక్షిస్తే తెలంగాణ పేద ప్రజలకి తెలంగాణ రాష్ట్ర విభజన ఫలితాలు పూర్తిగా చేరుతాయనేమడంలో ఏమాత్రం సందేహం లేదని ఆళ్ల రామకృష్ణ అన్నారు.

Next Story