- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Khaiarathabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపతికి కర్రపూజ
హైదరాబాద్(Hyderabad)లోని ఖైరతాబాద్ మహా గణపతి(Khaiarathabad Ganesh)కి నేడు కర్రపూజ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని ఖైరతాబాద్ మహా గణపతి(Khaiarathabad Ganesh)కి నేడు కర్రపూజ జరిగింది. 71వ గణేష్ ఉత్సవాల కోసం కర్రపూజతో ఉత్సవ ఏర్పాట్లను మొదలు పెట్టారు నిర్వహకులు. కాగా ఈ ఏడాది 71 అడుగుల ఎత్తైన విశ్వశాంతి మహాశక్తి గణపతి(Viswashanthi Mahashakti Ganapathi) విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబబంధించిన పోస్టర్ ను నగర మేయర్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. చెన్నైకి చెందిన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మంది కళాకారులు ఈ నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఈ విగ్రహం విశ్వశాంతిని ప్రతిబింబిస్తూ అయోధ్య రామ్‌లల్లా విగ్రహం, శివపార్వతి, శ్రీనివాసుల కల్యాణ మండపం వంటి అదనపు ఆకర్షణలతో రూపొందుతోంది.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్. శంకరయ్య స్థాపించిన ఈ ఉత్సవం ప్రస్తుతం ఆయన వారసుడు సింగరి రాజ్‌కుమార్ నేతృత్వంలో జరుగుతోంది. ఆగస్టు 26న ప్రారంభమై 11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవం సెప్టెంబర్ 5న హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంతో ముగియనుంది. రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం, ప్రత్యేక పూజలు, ఆరతులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. నిమజ్జన ఊరేగింపు ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు లక్షల మంది భక్తుల మధ్య జరిగి, సాగర్లో నిమజ్జనం అవడంతో ఉత్సవం ముగుస్తుంది.






