- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగ్యనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బాధితులకు న్యాయం చేయాలి..
ఎల్ఆర్ఎస్ మంజూరు చేసి ఇంటి నిర్మాణాలకు అనుమతించండని సిఎంసి కమిషనర్‌ను ప్లాట్ల యజమానులు కోరారు.

దిశ, శేరిలింగంపల్లి: హైటెక్ సిటీ సమీపంలో సర్వేనెంబర్ 1007 లో భాగ్యనగర్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన 167 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 1400 మంది ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు మాదాపూర్ లోని సీఎంసి కార్యాలయంలో కమిషనర్ సృజనకు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితులు కథనం ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. సొసైటీకి 1992 నుంచి 1998 మధ్య కాలంలో వివిధ సేల్ డేట్‌ల ద్వారా 50 ఎకరాలు, 70 ఎకరాలు, 25, 22 ఎకరాలు మొత్తం 167 ఎకరాల నాలుగు విడతలుగా భూమిని సేకరించి లేఅవుట్ వేసి ప్లాట్లు చేసి విక్రయించారు. మరో 119 ఎకరాలకు కూడా సొసైటీ ఆధీనంలో ఉంది. ఆ తర్వాత సొసైటీ 167 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి 1400కు పైగా ఫ్లాట్ యజమానులలో దాదాపు 600 మంది వరకు జిహెచ్ఎంసిలో ఎల్ఆర్ ఎస్ రెగ్యులరైజేషన్ స్కీం కింద దరఖాస్తులు చేసుకున్నారు. కొంతమంది ఫ్లాట్ యజమానులకు భవన నిర్మాణ అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు ఇంటి లభ్యమైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి భాగ్యనగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ హక్కులు కాపాడాలన్నారు. భవన నిర్మాణ అనుమతులు, పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వర్తింపు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎలాంటి ఆధారాలు లేకపోయినా...
భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం, హైకోర్టు ఆదేశాల మేరకు యజమానులు హక్కులను ధృవీకరించడం ద్వారా టి డి ఆర్, ఎల్ఆర్ఎస్, ఇంటి నెంబర్లు మంజూరు కు చొరవ తీసుకోవాలన్నారు. చట్టబద్ధ చర్యల ద్వారా మంజూరయ్య నిధులతో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. 04.06.2019 నాటి ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వు ద్వారా సంబంధిత రిట్ పిటిషన్లను (WP నం. 22896, 25132, 26824 & 27963/2018) అనుమతి మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. తగిన ఉత్తర్వులు వెలువడే వరకు, సర్వే నం. 1007లోని భూమికి సంబంధించిన ఏ పత్రాన్ని కూడా రిజిస్ట్రేషన్ కోసం స్వీకరించవద్దని రిజిస్ట్రేషన్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. భాగ్యనగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనకున్న పలుకుబడీతో ప్రైమ్ ప్రాపర్టీస్ యజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టైటిల్, ట్రాన్స్ఫారబుల్ డెవలప్మెంట్ రైట్స్ సొసైటీ ప్రణాళిక ప్రకారం రోడ్లు వేయడం, లేఅవుట్ ను నగరం మాస్టర్ ప్లాన్‌లో చేర్చడం ద్వారా చట్టబద్ధ హక్కులను గుర్తించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న అనుమతులు, ఎల్ఆర్ఎస్, ఇంటి నెంబర్లు, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాలన్నారు. నకిలీ పత్రాలు సృష్టించిన అబ్బాస్ అలీ ఖాన్ సెప్టెంబర్ 5 2024న సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్స్ స్ లో ఫిర్యాదు చేసామన్నారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్ - 45 /2024 నమోదు అయ్యిందని చెప్పారు. భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ భూమికి, ఫ్లాట్ల యజమానులక రక్షణ కల్పించాలని కమిషనర్ను కోరామన్నారు.






