- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం పోలింగ్
నేడు బిహార్ అసెంబ్లీ రెండవ విడత ఎన్నికలతోపాటు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : నేడు బిహార్ అసెంబ్లీ రెండవ విడత ఎన్నికలతోపాటు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా 11 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆయా బూత్ ల వద్ద ఓటర్లు బారులు తీరడం కన్పించింది. దీంతో ఉదయం పోలింగ్ శాతం కొంత మేర తగ్గినట్టు కనిపించినా.. అనంతరం పుంజుకుంది.
కాగా ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతూ ఓటర్లను భయపెడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపణలు చేసారు. ఓడిపోతున్నామనే అసహనంలో సునీత నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మండిపడ్డారు. మరో రెండు గంటల్లో పోలింగ్ ముగుస్తున్నప్పటికీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదని అభిప్రాయపడుతున్నారు.






