- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన ప్రచారం...ప్రలోభాలు మొదలు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఓటర్లను ప్రభావితం

దిశ, హైదరాబాద్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు మాటల తూటాలు పేల్చాయి. పోలింగ్‌కు సోమవారం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు మొదలు పెట్టాయి. కాగా, ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హైడ్రాను ప్రధాన ఆయుధంగా వాడుకున్నాయి. హైడ్రాతో ప్రైవేట్, పేదల ఆస్తులను కూల్చివేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. చెరువులు, కుంటలు, పార్క్‌లు ఆక్రమించుకొని చేసిన నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చి వేసి ప్రభుత్వ స్థలాలను కాపాడుతున్నదని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. మొత్తం మీద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలుపు తీరాలకు చేర్చుతాయని నమ్ముతున్న అంశాలు ఇవే..
బీఆర్ఎస్..
- సెంటిమెంట్‌ను గట్టిగా నమ్ముకుంది. మాగంటి గోపీనాథ్‌పై ఉన్న సింపతి సునీతను గట్టెక్కిస్తుందనే నమ్మకం ఉంది.
- పదేళ్లలో రూ.5 వేల కోట్లు జూబ్లీహిల్స్ అభివృద్ధికి వెచ్చించామనే ప్రచారాన్ని ఓటర్లకు చేరేలా ప్రయత్నం చేసింది.
- ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆరోపణలు చేసింది.
ఆడబిడ్డ వర్సెస్ రౌడీ మధ్యే పోటీ అని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే స్థానికంగా రౌడీ రాజ్యం వస్తుందని మౌత్ టాక్ విస్తృతం చేసింది.
- హైడ్రాను బూచిగా చూపి వ్యక్తుల ఆస్తులు కూల్చివేతలు చేస్తున్నారని ప్రజలకు వివరించింది.
- గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతున్నది. రెండేళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ప్రజలకు ఒరిగిందేమీ లేదనే తదితర అంశాలను బలంగా ఓటర్లలోకి తీసుకెళ్లింది
కాంగ్రెస్..
- హైదరాబాద్ లో తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతున్నది.
- బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లుగా ఒక్క రేషన్ కార్డు పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది.
- ఇప్పుడు సుమారు 2 లక్షల రేషన్ కార్డులు ఒక్క జూబ్లీహిల్స్‌లో ఇచ్చామనే ప్రచారం.
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం.
- హైడ్రాను అందుబాటులోకి తెచ్చి కోట్లాది రూపాయల విలువైన చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలను కాపాడాం.
- మాగంటి కుటుంబ తగాదాలను తెరమీదకు తేవడం.
- ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే వారు ఎలా అభివృద్ధి చేస్తారు ? అధికార పార్టీకి అవకాశమిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది.
బీజేపీ..
- బీజేపీ మాత్రం ఎంఐఎంను టార్గెట్ చేసింది. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేననే ప్రచారాన్ని ప్రధానంగా కొనసాగించింది.






