- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవికుమార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక
భారతీయ జనతాపార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.

X
దిశ, శేరిలింగంపల్లి : భారతీయ జనతాపార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల రమేష్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన యువకులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు, ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగరేయడానికి చాలామంది యువత ఎదురుచూస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో సంతోష్ ముదిరాజ్, వసంత్, శ్రీను, రాఘవేంద్ర, అజయ్, మురళి, అరవింద్, మోహన్, నాగరాజు, మహేష్ తదితరులు ఉన్నారు.
Next Story






