- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, చైతన్యపురి : ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గడ్డి అన్నారం డివిజన్ దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగ యువత స్వయంగా ఏర్పాటు చేసుకున్న “ఆస్పరెంట్ అడ్డా- టీ పాయింట్” వద్ద నిరుద్యోగులతో టీ తాగుతు సమావేశమయ్యారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ ప్రాంతంలో నిరుద్యోగ యువతను కలిసి పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రియాంక గాంధీ ప్రకటించిన నిరుద్యోగులకు రూ. 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు అందించడంతోపాటు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
ఉద్యోగాల ఊసే లేకుండా నిరుద్యోగ యువతను ప్రభుత్వం నిరాశలోకి నెట్టిందన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామకాల్లో చోటుచేసుకున్న అనుమానాలపై సిట్ ఎంక్వయిరీ నిర్వహించి పారదర్శకంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో తమ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రనాయక్, శంకర్, శింబు నాయక్, భూక్యాకుమార్, నవీన్ పట్నాయక్, సింధురెడ్డి, ఆకాష్, అంజలి, శ్రీదేవి, అశోక్, నందు, శ్రీలక్ష్మీ పాల్గొన్నారు.





