- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్ హైదరాబాద్‌పై జనసేన గురి... తొలి వ్యూహం అమలు
గ్రేటర్ హైదరాబాద్‌పై జనసేన పార్టీ గురి పెట్టినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొన్ని నెలల్లో డివిజన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన వ్యూహాలకు పదును పెట్టినట్లుగా తెలుస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌పై జనసేన పార్టీ గురి పెట్టినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొన్ని నెలల్లో డివిజన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన వ్యూహాలకు పదును పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక సమస్యలపై ఆ పార్టీ నాయకులు దృష్టి పెట్టారు. నిరంతరం ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఎవరైనా తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ సభ్యుల వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు.
సెంట్రింగ్ కార్మికులు, గుత్తేదారుల అసోసియేషన్‌కు జనసేన మద్దతు
అయితే ఈ దీక్షకు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికులు, గుత్తేదారుల అసోసియేషన్ సభ్యులు జనసేనను మద్దతు కోరారు. దీంతో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఇందిరాపార్క్ ధర్నా ప్రదేశానికి వెళ్లారు. కార్మికులను పరామర్శించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వారి న్యాయపరమైన డిమాండ్లకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాకుమాను లక్ష్మణ్ రావు, కొల్లా శంకర్, బోగాదివెంకటేశ్వరావు, వేముల మహేష్, పోలెబోయిన శ్రీనివాస్, మాధవ్ రావు, బడే విశ్వేశ్వర్ రావు, చిట్టిబాబు, జనసైనికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా పార్టీతో పాటు ఇతర కార్యక్రమాల్లో జనసేన నాయకులు బిజీ అవుతున్నారు. స్థానికంగా బలోపేతం కృషి చేస్తున్నారు. హైదరాబాద్ డివిజన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతోందనే సంకేతాలు ఇప్పటి నుంచే ఇస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో జనసేన వ్యూహాలు చర్చనీయాంశంగా మారాయి. చూడాలి మరి జనసేన పార్టీ ఎంత వరకూ సక్సెస్ సాధిస్తుందో.






