Hyd: నారా లోకేశ్‌తో పవన్ కల్యాణ్ అత్యవసర భేటీ.. గంటపైగా కీలక చర్చలు

by Vemula.Srinu Prasad |

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అత్యవసరంగా భేటీ అయ్యారు....

Hyd: నారా లోకేశ్‌తో పవన్ కల్యాణ్ అత్యవసర భేటీ.. గంటపైగా కీలక చర్చలు
X

దిశ, వెబ్ బెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అత్యవసరంగా భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో పరామర్శించిన జనసేనాని.. ఆ తర్వాత లోకేశ్‌తో సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలపై గంటకుపైగానే చర్చిస్తున్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల, క్షేత్ర స్థాయి పోరాటాలు వంటివాటిపైనా సమావేశంలో చర్చకు వచ్చాయి. అటు బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో బీజేపీతో కలిసి వెళ్లాలా?.. వద్దా..? అనే అంశాలపైనా ఈ భేటీలో పవన్, లోకేశ్ మధ్య చర్యకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతోంది. ఈ భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి కార్యచరణ త్వరలో ప్రకటించేందుకు రెడీ అవుతున్న సమయంలో పవన్-లోకేశ్ భేటీ మరింత ఉత్కంఠతను రేపుతోంది.

Next Story