- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లేడీస్ హాస్టల్ వద్ద హల్ చల్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష ..
ఓ లేడీస్ హాస్టల్ వద్ద హల్ చల్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష పడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, ఖైరతాబాద్: ఓ లేడీస్ హాస్టల్ వద్ద హల్ చల్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష పడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవన్ కుమార్(33) తాగిన మైకంలో ఎస్ఆర్ నగర్ పరిధిలోని లేడీస్ హాస్టల్ వద్ద బుధవారం రాత్రి హల్ చల్ చేశాడు. దీంతో స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు అతనిని ఎస్ఆర్ నగర్ పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో భవన్ కుమార్ పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలడాడు. దీంతో పోలీసులు భవన్ కుమార్ కి మద్యం పరీక్ష చేయగా 199 శాతం వచ్చింది. ఈ మేరకు భవన్ కుమార్ పై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచారు. కాగా భవన్ కుమార్ కు రెండు రోజుల జైలు శిక్ష విధించటం జరిగింది.
Next Story






