HYD: రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు.. నగదు, డాక్యుమెంట్లు సీజ్

by Disha Web Desk 16 |
HYD: రియల్ ఎస్టేట్  సంస్థలపై ఐటీ దాడులు.. నగదు, డాక్యుమెంట్లు సీజ్
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్‌లో రియల్ సంస్థలపై వరుసగా మూడో రోజు కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కోహినూర్‌తోపాటు మరో ఆరు రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయిదేళ్లుగా కొన్ని రియల్ సంస్థలు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు అందిన సమాచారంతో ఐటీ అధికారులు మూడు రోజుల క్రితం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచే వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు మొత్తం నలభై చోట్ల సోదాలు జరపటం మొదలు పెట్టారు. దీంట్లో భారీ మొత్తంలో నగదు, కీలక డాక్యుమెంట్లు ఐటీ అధికారుల చేతికి చిక్కినట్టు సమాచారం. దాంతోపాటు కొన్ని రియల్ సంస్థల యాజమాన్యాలు బినామీ కంపెనీల పేర పెద్ద ఎత్తున భూ క్రయవిక్రయాలు జరిపినట్టు వెళ్లడయ్యిందని తెలిసింది.


Next Story

Most Viewed