- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎండీఎంఏ డ్రగ్ అమ్ముతూ పట్టుబడ్డ సాప్ట్ వేర్ ఉద్యోగి
ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి మత్తు పదార్థాలకు బానిసగా మారి చివరికీ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, శేరిలింగంపల్లి : ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి మత్తు పదార్థాలకు బానిసగా మారి చివరికీ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయికిరణ్ (28) ఓ ప్రైవేట్ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారిన సాయికిరణ్ బెంగళూరులో కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం కేశవ్ నగర్ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. కేశవ్ నగర్ లో నివాసముంటున్న సాయికిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.1లక్ష 30వేల విలువైన 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ జోన్ ఎస్వోటీ పోలీసులు నిందితుడినీ అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






