హైద‌రాబాద్ లో అంత‌ర్రాష్ట్ర గంజాయి గ్యాంగ్ ప‌ట్టివేత

by Nallavelli.Anjaneyulu |

రైళ్ల ద్వారా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.9.42 లక్షల విలువైన 18.852 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

హైద‌రాబాద్ లో అంత‌ర్రాష్ట్ర గంజాయి గ్యాంగ్ ప‌ట్టివేత
X

దిశ, సికింద్రాబాద్ : రైళ్ల ద్వారా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.9.42 లక్షల విలువైన 18.852 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ ఎస్.ఎన్. జావెద్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మహారాష్ట్రకు చెందిన సూరజ్ అనిల్ యాదవ్ (23), ప్రసాద్ మహాదేవ్ మొహితే (23)గా గుర్తించారు. వారి వద్ద ఉన్న లగేజ్ బ్యాగ్‌ను పరిశీలించగా 9 ప్యాకెట్లలో గంజాయి లభించింది. విచారణలో జగదీష్ అనే వ్యక్తి రాజమండ్రి నుంచి శోలాపూర్‌కు గంజాయి తరలిస్తే ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిందితులు వెల్లడించారు. ఈ మేరకు ఏప్రిల్ 15న రాజమండ్రిలో కుమార్ అనే సప్లయర్ నుంచి గంజాయి తీసుకుని కొనార్క్ ఎక్స్‌ప్రెస్‌లో షోలాపూర్‌కు బయలుదేరారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు గమనించి రైలు దిగిపోయి, ముంబై ఎక్స్‌ప్రెస్ ద్వారా వెళ్లేందుకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫారం నంబర్ 6 వద్ద వేచి ఉండగా పోలీసులు తనిఖీలు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జగదీష్, కుమార్ పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story