International Kite Festival : హైదరాబాద్ లో మూడు రోజులపాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) లో సంక్రాంతి(Sankranthi)కి మూడు రోజులపాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్(International Kite Festival) జరగనుంది.

International Kite Festival : హైదరాబాద్ లో మూడు రోజులపాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో సంక్రాంతి(Sankranthi)కి మూడు రోజులపాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్(International Kite Festival) జరగనుంది. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్(Pared Grounds) వేదికగా జనవరి 13 నుంచి 15 వరకు ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishnarao) పేర్కొన్నారు. అదేవిధంగా అతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్(International Sweet Festival) ను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాగరవసులు ఈ కైట్, స్వీట్ ఫెస్టివల్ లో పాల్గొనాలని సూచించారు. ఈ కైట్ ఫెస్టివల్ లో దాదాపు 50 దేశాలకు చెందిన 150 మంది ఫ్లయర్స్ పాల్గొంటారని తెలిపారు. ఈ మూడురోజులపాటు పరేడ్ గ్రౌండ్స్ లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ఫెస్టివల్ లో ఎవరైనా పాల్గొనవచ్చని, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ తో పాటు దేశంలోని ప్రముఖ స్వీట్స్ స్టాల్స్ అందుబాటులో ఉంటాయన్నారు.

Next Story