- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమస్యల సుడిగుండంలో ఇండోర్ స్టేడియం
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా తయారైంది సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం పరిస్థితి. రంగారెడ్డి

దిశ, చైతన్యపురి: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా తయారైంది సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో వందలాది మంది విద్యార్థులను క్రీడారంగంలో క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ముందుకు పోతున్నా కానీ స్టేడియంలో కనీస మౌలిక సదుపాయలు కల్పించాలని అధికారులు దృష్టి సారించకపోవడం విచారకరం. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో సమస్యలు తిష్ట వేసి కూర్చున్నాయి.
సమస్యలు ఏమున్నాయి
రంగారెడ్డి జిల్లాలో క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం 28 ఏండ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిర్మాణం చేసింది. అధికారుల అలసత్వం వలన ఇక్కడ సమస్యలు అనేకం ఉన్నాయి. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నిర్లక్ష్యం వలన కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించి ఖాళీ సీసాలు వదిలిపోతున్నారు. మూత్రశాలలు దుర్గంధం వెదజళ్లుతున్నా శుభ్రం చేయడంలేదు. మల, మూత్రాలు మూత్రశాలలో పేరుకుపోయి లోపలికి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ పడితే అక్కడ గడ్డి పెరిగి క్రిమి కీటకాలు, పాములు సంచరిస్తున్నాయని వాకర్స్ తెలిపారు. సమస్యలన్నింటికి ఉన్నతాధికారి పర్యవేక్షణ, పట్టింపు లేకపోవడం కారణంగా కనిపిస్తుంది.
పెచ్చులూడిన పైకప్పు
ఇండోర్ స్టేడియం లోపల పైకప్పు పూర్తిగా శిదిలమై పెచ్చులూడిపోయాయి. తద్వారా వర్షం వచ్చినపుడు నీరంతా లోపల కురుస్తుంది. వర్షపు నీరు లోపల కురవడంతో కింద ఉన్న మ్యాట్ ఉబ్బిపోయి క్రీడాకారులు ఆడే పరిస్థితి లేదు. పేరుకు మాత్రమే స్టేడియం ఉంది కానీ సమస్యలు పరిష్కరించాలనే తపన సంబంధిత అధికారికి లేకపోవడం గమనార్హం. ఈ విషయమై జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావును వివరణ కోసం సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.






