- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయుల కిడ్నాప్ అయిన ఘటన ఆలస్యంగా

దిశ, శేరిలింగంపల్లి : పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయుల కిడ్నాప్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 1వ తేదీన పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేసిన జేఎన్ఐఎమ్ ఉగ్రవాదులు ఫ్యాక్టరీపై దాడి చేసి అందులో పనిచేస్తున్న ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేశారు. మాలిలోని మూడు కంపెనీలపై దాడులకు తెగబడిన జేఎన్ఐఎమ్ ఉగ్రవాదులు డైమండ్ సిమెంట్ కంపెనీ జనరల్ మేనేజర్ జోషి ( రాజస్థాన్)తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లిఫ్ట్ ఇంజనీర్, ఆటోమొబైల్ ఫోర్మన్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
మాలికి చెందిన డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీతో హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన ఓ ప్రముఖ కంపెనీతో పార్టనర్ షిప్ ఉన్నట్లు సమాచారం. అయన చాలా కాలంగా వెస్ట్ ఆఫ్రికాలోని ఘనా, టోగో, తదితర దేశాలల్లో సిమెంట్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నిర్వహిస్తున్న కంపెనీలలో 27.5శాతం వాటా కలిగి వున్నారు. తమ ఫ్యాక్టరీలో కిడ్నాప్ విషయం తెలుసుకున్న కంపెనీ అధినేత మాలికి బయలుదేరి వెళ్లారు.
ఇండియన్ ఎంబసీ ప్రకటన..
ముగ్గురు భారతీయుల కిడ్నాప్ పై ఇండియన్ ఎంబసీ వేగంగా స్పందించింది. మాలీ రాజధాని బమాకోలో ఉన్న భారత రాయబార కార్యాలయం, మాలీ ప్రభుత్వ సంబంధిత అధికారులతో, స్థానిక భద్రతా సంస్థలతో పాటు డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో నిరంతర సంప్రదింపులు చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. కిడ్నాప్ కు గురైన భారతీయుల కుటుంబ సభ్యులతో కూడా రాయబార కార్యాలయం చర్చలు జరుపుతుందని తెలిపింది. ఈ దారుణమైన హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
మాలీ ప్రభుత్వాన్ని ఈ ముగ్గురు భారతీయుల త్వరగా, సురక్షితంగా విడుదల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పరిణామాలను మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు జాగ్రత్తగా గమనిస్తూ, భారతీయుల విడుదలకు అవసరమైన చర్యలు తీసేందుకు అన్ని స్థాయిల్లో చొరవ తీసుకుంటున్నట్లు తెలిపింది.






