- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
temples : దేవాలయాలకు బోనాల ఆర్థిక సహాయం పెంచండి..
by Batti.Sumithra |
ఆషాడమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హరిబౌళి బంగారు మైసమ్మ దేవాలయ కమిటీ ప్రతినిధుల బృందం ఒక వినతిపత్రాన్ని అందజేసింది.

X
దిశ, చార్మినార్ : ఆషాడమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హరిబౌళి బంగారు మైసమ్మ దేవాలయ కమిటీ ప్రతినిధుల బృందం ఒక వినతిపత్రాన్ని అందజేసింది. అలాగే ఈ నెల 28వ తేదీన జరుగనున్న హరిబౌళి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆర్థిక సహాయం పెంచాలన్న విజ్ఞప్తి మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించినట్లు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గౌడ్ తెలిపారు.
Next Story






