ప్రేమ పేరుతో త‌న‌లా మ‌రొక‌రు మోస‌పోకూడ‌దు

by Ratna Kumari |

ప్రేమ పేరుతో ద‌గ్గ‌రై.. ఆ త‌రువాత పెళ్లి చేసుకొని చిత్ర హింస‌ల‌కు పాల్ప‌డిన నిందితుడు న‌వాజ్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొని, శిక్షించాల‌ని బాధితురాలు పేర్కొన్నారు

ప్రేమ పేరుతో త‌న‌లా మ‌రొక‌రు మోస‌పోకూడ‌దు
X

దిశ‌, ఖైర‌తాబాద్ : ప్రేమ పేరుతో ద‌గ్గ‌రై.. ఆ త‌రువాత పెళ్లి చేసుకొని చిత్ర హింస‌ల‌కు పాల్ప‌డిన నిందితుడు న‌వాజ్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొని, శిక్షించాల‌ని బాధితురాలు పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సంవత్సరం కూక‌ట్ ప‌ల్లిలో పరిచమైన నవాజ్ కలిసి బిజినెస్ చేద్దామంటూ ఆఫర్ చేశారని, ఆ తర్వాత ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడన్నారు. మతపరమైన ఇబ్బందులు రాకుండా తానే మతం మార్చుకుంటానని చెప్పుకొచ్చాడని, అంతేకాకుండా నవదుర్గగా పేరు మార్చుకున్నట్లు సర్టిఫికేట్ ని సైతం చూపించాడన్నారు. అతని మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నానని, మొదటి సారి బేగంపేటలో అతను అద్దె తీసుకున్న గదికి తీసుకుపోయాడని, అక్కడే తనకు మత్తు మందు ఇచ్చి అతని సోదరుడు, స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడని వాపోయారు.

ఆ తర్వాత తన ఫోన్ ని లాక్కున్నాడని, ఆ తర్వాత మతం మారాలంటూ చిత్రహింసలకు గురి చేశాడన్నారు. అతని కుటుంబ సభ్యులు సైతం తనను తీవ్రంగా వేదించారని, బలవంతంగా నమాజ్, కల్మా చదివించారని, తీవ్రంగా కొట్టి బీఫ్ తినిపించారన్నారు. తనను ఓసారి బెంగళూరుకు తీసుకెళ్లగా, అతని రెండు వివాహాల బాగోతం బయటపడిందని, దీంతో అక్కడికి పోలీసులకు ఫిర్యాదు చేశానని, అప్పుడు తానే రెండు వివాహాలు జరిగాయని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాడని తెలిపారు. ఎవరికైనా ఫోన్ చేయాలంటే తన ఫోన్ తోనే మాట్లాడించే వాడని, తన బ్యాంకు అకౌంట్లను తానే నడిపించేవాడని, శంషాబాద్ లో ఉన్న తమ భూమిని అమ్ముకున్నాడని, డబ్బులు సైతం ఇవ్వలేదన్నారు. నవాజ్ కి గంజాయి, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, అతనితో పాటు అతని సోదరులు, స్నేహితులు వాటిని తీసుకునే వారన్నారు. తనను దుబాయి తీసుకెళ్తానని చెప్పాడని, దీంతో అతని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని, హైదరాబాద్ లోని ఇంటి వద్ద పాస్ పోర్టు తెచ్చుకుంటానని చెప్పి తప్పించుకున్నానన్నారు ఆరోపించారు. తనతో పాటు మరికొంత మంది జీవితాలను సైతం నవాజ్ నాశనం చేశాడని, లవ్ జిహాద్ పట్ల ఆడపిల్లలు జాగ్రత్త ఉండాలని, ఇలాంటి వారి భారిన పడుకుండా ఉండేందుకు తాను బయటకు వచ్చి ఈ నిజాలు చెబుతున్నానని స్పష్టం చేశారు. తన లాగా మ‌రే ఆడపిల్లకు అన్యాయం జరుగవద్దని తెలిపారు.

Next Story