- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇందిరాగాంధీ’ సొసైటీలో అక్రమ షెడ్ల నిర్మాణం
సర్కిల్ పరిధిలోని ఇందిరా గాంధీ హౌసింగ్ సొసైటీలో యథేచ్ఛగా భారీ అక్రమ షెడ్ల నిర్మా ణాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోవ డం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, రాజేంద్రనగర్: సర్కిల్ పరిధిలోని ఇందిరా గాంధీ హౌసింగ్ సొసైటీలో యథేచ్ఛగా భారీ అక్రమ షెడ్ల నిర్మా ణాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోవ డం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. అధికారులు నిర్మాణ దారుల నుంచి అందినంత దండుకొని మిన్న కుండి పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు చేస్తే అధికారులు నోటీసు లు ఇచ్చి చేతులు దులుపుకోవ డం తప్ప అక్రమ షెడ్లపై ఎలాంటి చర్య లు తీసుకొవడం లేదు. రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ గోదాంలు లేదా షెడ్లు నిర్మాణం చేసేందుకు ఎలాంటి అనుమతులు జారీ చేయరు. కానీ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలో అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలు జోరు గా కొనసాగుతున్నాయి. భవన నిర్మా ణాల ద్వారా లభించాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతున్నా అధికారులెవరూ దీనిపై దృష్టి సారించడం లేదు.
ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ..
ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ 1966లో ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా లోని రాజేంద్రనగర్ మండలం, బాలాపూర్ మండల పరిధిలో 198 ఎ కరాల విస్తీర్ణంలో ఇందిరాగాంధీ హౌ సింగ్ సొసైటీ అవతరించింది. 198 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నా ఈ సొసైటీ లో 803 ప్లాట్లను ఏర్పాటు చేశారు. అయితే రాజేంద్రనగర్ మండలం ప్ర స్తుతం గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి లోని గగన్ పహాడ్ ప్రాంతంలో 148 ఎకరాల్లో మెజార్టీ ప్లాట్లు ఉండగా, బాలాపూర్ మండలంలోని జలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్ కాలనీలో 50 ఎకరాల్లో మిగతా ఫ్లాట్లు ఏర్పడ్డాయి. ప్లాట్లను నాలుగు విభాగాలుగా విభ జించి 1350 గజాలు, 1000 గజా లు, 700 గజాలు, 500 గజాలు ప్లాట్స్ చేసారు. రెసిడెన్షియల్ జోన్ లో 90 శాతం మేరకు కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారు. జననివాసాల కోసం ఏర్పడ్డ ఇందిరా గాంధీ సొసైటీ లో ప్రస్తుతం కనుచూపుమేరలో కూడా ఒక్క భవన నిర్మాణం కూడా కనిపించడం లేదు.
నోటీసులతో సరి..
అక్రమ షెడ్ల నిర్మాణాలపై ఎప్పటికప్పు డు పర్యవేక్షణ జరిపి సదరు నిర్మాణాలకు ముందస్తుగా టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇస్తారు. నోటీసు స మయం పూర్తయినప్పటికీ సరైన రీతిలో నిర్మాణదారుడి నుంచి స్పందన రాక పోతే ఆ నిర్మాణాన్ని కూల్చేయాల్సింది గా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ అక్రమ నిర్మాణాల విషయంలో తమ తప్పు ఏమీ లేదు అనిపించుకునే విధంగా మాత్రమే టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు పని కానిస్తున్నారు. కానీ సదరు నిర్మాణాన్ని పూర్తిగా ఆపేయడం గాని లేదా కూల్చివేసే దిశగా గాని అడుగులు వేయడం లేదు. అక్రమ నిర్మాణాలపై ఏమి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్ని స్తే వారి నుంచి వచ్చే మొదటి సమా ధానం చూస్తాం.. పరిశీలిస్తామని, నోటీ సులు ఇచ్చామని టాస్క్ ఫోర్స్ అధికారులకు సిఫార్సు చేశాం అని మాత్రమే తప్ప మరో విషయం ఉండదు.
నాయకులకు కాసులు..?
ఇందిరా గాంధీ హౌసింగ్ సొసైటీలో చేపడుతున్న అక్రమ షెడ్ల నిర్మాణాలకు అధికార పార్టీ, నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలిసింది. రాజకీయ నాయకుల అండతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. దింతో అధికారుల చర్యలు తీసుకునేందుకు సైతం వెనకడుగు వేస్తున్నారు. నగ రంలో వ్యాపారం చేసుకునేవారు ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ ప్లాట్లను గోదాములుగా చేసుకొని ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా రు. దీంతో ఇందిరాగాంధీ లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు నార్త్ ఇండియ న్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వ్యా పారులకు ప్లాట్లు అమ్మే దగ్గర నుంచి వారికి కావలసిన సకల పనులను చక్కపెడుతున్నారు. గోదాం నిర్మాణాలు చేపట్టేందుకు తాము దగ్గరుండి పనులు చేయిస్తామని నిర్మాణదారుల నుంచి అందినంత దండుకుంటున్నారు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తు న్నాం. నిబంధనలు పాటించని నిర్మాణదారులపై చర్యలు తీసు కుంటాం. అలాగే రెసిడెన్సీయల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలను గుర్తించి గుర్తించి కూల్చివేస్తాం. ఇందిరాగాంధీ హౌ సింగ్ సొసైటీ తో పాటు, మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న షెడ్ల ని ర్మాణాలకు నోటీసులు అందజేశామని స్పీకింగ్ ఆర్డర్లు ఇచ్చి కూల్చి వేస్తాం.అనుమతులు లేని నిర్మాణాలను ఉపేక్షించేది లేదన్నారు.
- ఏసీపీ శ్రీధర్






